
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఫౌజీ‘. ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ మరొక క్రేజీ న్యూస్ చెప్పారు. ఫౌజీ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పూ లేదని చెప్తూనే అభిమానులు కోసం డిసెంబర్ 2వ తేదీ రాత్రి నుంచే ప్రత్యేక పెయిడ్ ప్రిమియర్ షోలు ప్రదర్శించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
హను రాఘవపూడి మార్క్ మేకింగ్, ప్రభాస్ పవర్ ప్యాక్డ్ లుక్స్ కలిసి ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటించేలా చేశాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ నాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్.. ఈసారి ‘ఫౌజీ’తో డిసెంబర్ 3న ఎలాంటి సునామీ సృష్టిస్తారో లెట్స్ సీ.