Reading Time: 2 minutes
క్రికెట్‌ గతిని మార్చిన 5 షాట్లు.. ఇవి కనిపెట్టినోళ్లకు మొక్కినా తప్పులేదు!

క్రికెట్‌ గతిని మార్చిన 5 షాట్లు.. ఇవి కనిపెట్టినోళ్లకు మొక్కినా తప్పులేదు!

క్రికెట్‌లో సాంప్రదాయ షాట్లైన కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, పుల్, కట్, హుక్ వంటి షాట్లు అందరికీ తెలిసిందే. అయితే టీ20 క్రికెట్ అభివృద్ధి చెందడంతో బ్యాటర్లు కొత్త తరహా షాట్లను కనిపెట్టారు. బౌలర్ల వ్యూహాలను ఛేదించేందుకు వినూత్న షాట్లతో పరుగులు సాధిస్తున్నారు. కొన్ని షాట్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా మ్యాచ్ ఫలితాన్నే మార్చే స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. అలాంటి ఐదు విచిత్రమైన షాట్లు ఇవే.

స్విచ్ హిట్

ఈ షాట్‌ను ఆడే సమయంలో బ్యాటర్ బంతి వేయకముందే తన స్టాన్స్‌ను మార్చుకుంటాడు. కుడిచేతి బ్యాటర్ ఎడమచేతి బ్యాటర్‌లా, ఎడమచేతి బ్యాటర్ కుడిచేతి బ్యాటర్‌లా మారి షాట్ ఆడతాడు. దీంతో ఫీల్డింగ్ సెట్టింగ్‌ను బౌలర్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. ఈ షాట్‌ను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు.

Peterson Switch Hit

Peterson Switch Hit

దిల్‌స్కూప్

శ్రీలంక దిగ్గజ బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ పరిచయం చేసిన ఈ షాట్ అతని పేరుతోనే ప్రసిద్ధి చెందింది. వికెట్ కీపర్ తలపైగా ఫైన్ లెగ్ దిశగా బంతిని స్కూప్ చేస్తూ ఆడతారు. యార్కర్లు లేదా ఫుల్ లెంగ్త్ బంతులను బౌండరీకి తరలించేందుకు ఈ షాట్ ఉపయోగపడుతుంది. సరైన టైమింగ్ లేకపోతే ఔటయ్యే ప్రమాదం ఎక్కువ.

Dilscoop

Dilscoop

ర్యాంప్ షాట్

ఈ షాట్‌లో బ్యాటర్ బ్యాట్‌ను కోణంలో ఉంచి బంతి వేగాన్నే ఉపయోగించి వికెట్ కీపర్ లేదా షార్ట్ థర్డ్‌మ్యాన్ మీదుగా బంతిని పంపిస్తాడు. వేగంగా వచ్చే బంతులను కూడా సులభంగా బౌండరీకి తరలించే అవకాశం ఉంటుంది. టీ20 క్రికెట్‌లో ఈ షాట్ తరచూ కనిపిస్తుంది.

Ramp Shot In Cricket

Ramp Shot In Cricket

హెలికాప్టర్ షాట్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఈ షాట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యార్కర్ బంతులను కూడా మణికట్టు బలంతో లెగ్‌సైడ్ వైపు సిక్సర్లుగా మలచడం ఈ షాట్ ప్రత్యేకత. షాట్ పూర్తయ్యాక బ్యాట్ హెలికాప్టర్ రెక్కలా తిరుగుతుండటంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది అత్యంత కష్టమైన షాట్లలో ఒకటిగా భావిస్తారు.

Dhoni Helicopter Shot

Dhoni Helicopter Shot

అప్పర్ కట్

ఆఫ్ స్టంప్ వెలుపల బౌన్స్ అయ్యే వేగవంతమైన బంతిని థర్డ్‌మ్యాన్ మీదుగా గాల్లోకి లేపుతూ ఆడే షాట్‌ను అప్పర్ కట్ అంటారు. భారత మాజీ స్టార్ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఈ షాట్‌ను అద్భుతంగా ఆడేవాడు. వేగవంతమైన బౌలర్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఇది మంచి ఆయుధంగా ఉపయోగపడుతుంది.

Sachin Upper Cut

Sachin Upper Cut

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి