Reading Time: < 1 minute

ఏటీఎం దగ్గర సాయం చేస్తామని చెప్పి… కార్డు మార్చేసి.. మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..

Caption of Image.

ఏటీఎం దగ్గర సాయం చేస్తామని చెప్పి… అమాయకుల దృష్టి మళ్లించి కార్డులు కాజేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు అమీన్ పూర్ పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. జులై 29న అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

కృష్ణారెడ్డిపేటలోని SBI ఏటీఎం దగ్గర క్యాష్ విత్ డ్రా చేసేందుకు వెళ్లానని.. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతనికి సాయం చేస్తానని నమ్మించి .. ఏటీఎం పిన్ నంబర్ గమనించి మాటల్లో పెట్టి ఒరిజినల్ కార్డు కాజేసి నకిలీ కార్డు ఇచ్చి పరారయ్యారని తెలిపారు పోలీసులు.

ఈ ముఠా నిర్మానుష్యంగా ఉన్న ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాసి, సహాయం చేస్తామని చెప్పి పిన్ నంబర్ చూసి, ఏటీఎం కార్డులను మార్చేసేవారని తెలిపారు. అనంతరం ఆ కార్డుల ద్వారా నగదు డ్రా చేయడంతో పాటు పీఓఎస్ స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు జరిపి బాధితులను మోసం చేసేవారని తెలిపారు పోలీసులు.

నిందితులను అదుపులోకి తీసుకొని వారి దగ్గరి నుంచి 130 ఏటీఎం కార్డులు, 2BHIM UPI ప్రైమ్ లైట్జ్ పీఓఎస్ స్వైపింగ్ మిషన్లు, 3 ఆటో రిక్షాలు, 5 మొబైల్ ఫోన్లు, రూ. 27వేల 230 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఈ ముఠాలోని 8 మంది గతంలో హైదరాబాద్‌కు వచ్చి సైబరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు పోలీసులు.

పోలీసుల సూచనలు:

ఏటీఎం కేంద్రాల దగ్గర అపరిచితుల సహాయం తీసుకోకూడదు.
ఏటీఎం పిన్ నంబర్‌ను ఎవరికీ చెప్పవద్దు.
ఏటీఎం కార్డులను ఇతరులకు ఇవ్వరాదు, కార్డులు ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ఏటీఎం దగ్గర అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు గానీ, 100 కి గానీ డయల్ చేసి సమాచారం అందించాలి.

©️ VIL Media Pvt Ltd.