
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల ఎంపిక విషయంలో కొత్త దారిలో వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర హీరోలు తిరస్కరించిన కథలను కూడా నమ్మకంతో ఎంచుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’తో పాటు లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా కూడా ఉంది. ఇదే సమయంలో మలయాళ దర్శకుడు, హీరో బాసిల్ జోసెఫ్‌తో కూడా బన్నీ ఓ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘మిన్నల్ మురళి’ సినిమాతో సూపర్ హీరో జానర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్.. బన్నీ కోసం కూడా ఓ సూపర్ హీరో స్టోరీని రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ కథను గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో తెరకెక్కించాలని ప్రయత్నించినట్లు, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అదే కథ అల్లు అర్జున్ వద్దకు చేరిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ కూడా గతంలో సూర్యతో ఓ సూపర్ హీరో కాన్సెప్ట్‌పై పనిచేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రస్తుతం బన్నీ మాత్రం విభిన్న కథలు, కొత్త దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్‌లో పలువురు దర్శకులు అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా.. బన్నీ మాత్రం ఇతర భాషల దర్శకులతో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారని టాక్. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.