Reading Time: < 1 minute
4 Years Of Varanasi S S Rajamouli Reveals Indiana Jones Influence Shooting Progress

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కాంబోలో వస్తున్నా భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా ప్రయాణం మొదలై ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయింది. ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నారు.

2022లో ఈ చిత్ర కథ రాయడం మొదలుపెట్టాం అదే ఏడాది సెప్టెంబర్‌లో ఫొటోషూట్‌ నిర్వహించాము. 2023 ఫిబ్రవరిలో గ్రాండ్‌గా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంకా 20 శాతం షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. రాబోయే అక్టోబర్‌ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను చిన్నప్పటి నుండి హాలీవుడ్‌ మూవీస్‌ చూస్తూ పెరిగాను. ఆ ప్రభావం ఖచ్చితంగా నా సినిమాలపై ఉంటుంది. నాకు ఎంతో ఇష్టమైన ‘ఇండియానా జోన్స్’ తరహా కథాంశంతోనే ఈ ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ కథ వారణాసిలోనే ప్రారంభమై అక్కడే ముగుస్తుందని.. అయితే మధ్యలో ప్రేక్షకులను అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాల మీదుగా రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. అంటార్కిటికాలోని 300 అడుగుల భారీ మంచు పర్వతాలను, రామాయణ కాలం నాటి భారీ వానర సేనను సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించాము. ఈ సీన్స్‌ను అద్భుతంగా, విశాలంగా చూపించాలంటే ఐమాక్స్‌ ఫార్మెట్‌ కరెక్ట్. ప్రేక్షకులకు ముందుగానే కథ, నేపథ్యం తెలిస్తేనే వారు సినిమాను మరింతగా ఓన్ చేసుకుంటారని, అందుకే గ్లింప్స్ ద్వారా ‘వారణాసి’ ప్రపంచం ఎలా ఉండబోతోందో ముందే చెప్పామని’ అన్నారు. 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న వారణాసిపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.