Reading Time: 2 minutes

Prabhas : చార్మినార్ సెట్‌లో డార్లింగ్ ప్రభాస్.. ‘ఫౌజీ’ కోసం హను రాఘవపూడి గ్రాండ్ ప్లాన్!

Caption of Image.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక  పీరియాడిక్ రొమాంటిక్ వార్ యాక్షన్ డ్రామా  ‘ ఫౌజీ’. భారీ బడ్జెట్ తో నిర్మిస్తు్న్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. ఇందు కోసం భారీ సెట్ ను కూడా నిర్మించారు.. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

చార్మినార్ సెట్ లో షూటింగ్..

ఈ ‘పౌజీ’ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో చారిత్రక చార్మినార్‌కు అచ్చం పోలికగా ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక సన్నివేశాల కోసం ఈ గ్రాండ్ సెట్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ కొత్త సెట్ పూర్తవుతుందని.. ఈ కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం. దాదాపు 25 రోజుల పాటు కొనసాగే ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్‌లో సుమారు 90 శాతం భాగం పూర్తి కానుంది.

 ప్రభాస్ క్రేజ్ దృష్యా..

అయితే అసలు చార్మినార్ వద్దే షూటింగ్ చేయకుండా ప్రత్యేక సెట్ ఎందుకు నిర్మించారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దీనికి కారణం .. ప్రభాస్ కు ఉన్న భారీ క్రేజ్ దృష్యా.. పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే అభిమానుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఏర్పాట్లు వంటి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ భారీ సెట్ ను నిర్మించారు మేకర్స్. దీంతో చార్మినార్ అందాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంతో పాటు షూటింగ్ కు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు 

ALSO READ : Mrunal Thakur: నా ఫొటోలు, వీడియోలతో ఆటలు వద్దు.. 

భారీ బడ్జెట్ తో.. 

ఇక ‘ఫౌజీ’ సినిమా విడుదలపై వస్తున్న పుకార్లకు కూడా ఇటీవల నిర్మాత రవిశంకర్ చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్లుగానే 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దాదాపు రూ. 700 కోట్ల బడ్జెట్ లో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.