Reading Time: < 1 minute

ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వస్తోందా..? కొత్త ఫీచర్స్ తీసుకొచ్చిన TRAI MyCall యాప్

Caption of Image.

ఫోన్ మాట్లాడుతుంటే అనవసర డిస్టర్బెన్స్ వస్తోందా..? కాల్ కట్ కావడం.. గరగర అనటం.. సిగ్నల్ జంప్ కావడం.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)  MyCall యాప్‌ లో కొత్త ఫీచర్స్ తీసుకొచ్చింది. యాప్ ను కొత్తగా అప్‌డేట్ చేసింది. దీని ద్వారా మొబైల్ వినియోగదారులు వాయిస్ కాల్స్ నాణ్యతను రేట్ చేసి, నెట్‌వర్క్ సమస్యలను నేరుగా చెప్పవచ్చు. ఈ యాప్ Android ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంది. కాల్ తర్వాత ఫీడ్‌బ్యాక్ ను  TRAI తో పాటు  టెలికాం ఆపరేటర్లకు పంపుతుంది.

ఇండయాలో 100 కోట్లకు పైగా టెలికాం సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కాల్ డ్రాప్స్, వాయిస్ బ్రేక్‌లు, ఆడియో ఆలస్యం వంటి సమస్యలు ఇప్పటికీ సాధారణం. ఈ యాప్ అటువంటి సమస్యలను నమోదు చేసుకోవడానికి వినియోగదారులకు అవకాశం ఇస్తుంది. అయితే ఇది వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదులను పరిష్కారించే  అధికారిక పోర్టల్ కాదు.

యాప్‌లో ఏం రిపోర్ట్ చేయవచ్చు?

వినియోగదారులు వాయిస్ కాల్‌ను 1 నుంచి 5 స్టార్ల స్కేల్‌పై రేట్ చేయవచ్చు. ఆ తర్వాత ఎదురైన సమస్యను ఎంచుకుని రేటింగ్ ఇవ్వవచ్చు.  వాటిలో ముఖ్యమైనవి.. కాల్ డ్రాప్స్, కాల్ సమయంలో ఎకో  (రీసౌండ్స్), ఆడియో ఆలస్యం, వాయిస్ బ్రేక్ లేదా అస్పష్టత, క్రాస్ కనెక్షన్స్, ఒక వ్యక్తికి మరొకరి వాయిస్ వినిపించకపోవడం, కాల్ కనెక్ట్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం  మొదలైన ఆప్షన్స్ లో రేటింగ్స్ ఇవ్వవచ్చు.

యాప్ కాల్ తర్వాత ఆటోమేటిక్‌గా ఫీడ్‌బ్యాక్ ప్రాంప్ట్ చూపిస్తుంది. ఇంటరాక్టివ్ మ్యాప్‌పై ఫీడ్‌బ్యాక్ హిస్టరీని కూడా చూపిస్తుంది. సిగ్నల్ స్ట్రెంత్ తనిఖీ చేయడానికి కవరేజ్ టెస్ట్ కూడా ఉంది.

TRAI ప్రకారం, సమర్పించిన ఫీడ్‌బ్యాక్ సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు వెళ్తుంది. ఆపరేటర్లు ఈ డేటాను ఉపయోగించి సిగ్నల్ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి  చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.