
JIO: ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా రిలయన్స్ జియో (Jio) 52 కోట్లకు పైగా వినియోగదారులతో కొనసాగుతుంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు జియో కొత్త ప్లన్స్ తీసుకరావడం, ఉన్న ప్లాన్స్ లో మార్పులు హెసెయ్యడం జరుగుతునే ఉంటాయి.
ఇకపోతే ప్రతినెలా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తప్పించుకోవాలనుకునే వారికి ఈ లాంగ్-వాలిడిటీ ప్లాన్లు బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ ను అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రూ.3,599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటా, 912GBకు పైగా హైస్పీడ్ డేటా, OTT ప్రయోజనాలతో పాటు AI సేవలు కూడా లభిస్తున్నాయి.
Jio రూ.3,599 ప్లాన్‌లో ఏమేమి లభిస్తాయి?
రూ.3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఏడాది మొత్తం ఎలాంటి అదనపు రీఛార్జ్ అవసరం లేకుండా సేవలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు:
* 365 రోజుల వాలిడిటీ
* దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
* రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా
* ఏడాదికి మొత్తం 912GBకు పైగా డేటా
* రోజుకు 100 SMSలు
* అర్హత ఉన్న ప్రాంతాల్లో, 5G ఫోన్ ఉంటే అన్‌లిమిటెడ్ 5G డేటా
AI, OTT బెనిఫిట్స్ కూడా..
డేటా, కాలింగ్‌తో పాటు ఈ ప్లాన్‌లో పలు అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో..
* 3 నెలల పాటు JioHotstar Mobile + Hollywood సబ్‌స్క్రిప్షన్
* 50GB Jio AI Cloud స్టోరేజ్
* 18 నెలల Google Gemini Pro సబ్‌స్క్రిప్షన్ ఉచితం
దీనితో వినోదంతో పాటు AI ఆధారిత సేవలను కూడా అదనపు ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు.
రూ.3,999 ప్లాన్:
ఇంకా ఎక్కువ డిజిటల్ బెనిఫిట్స్ కోరుకునే వారికి జియో రూ.3,999 వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో కూడా 365 రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా, SMSలతో పాటు జియో యాప్‌ల యాక్సెస్, అదనపు డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. అయితే అందుబాటులో ఉండే సబ్‌స్క్రిప్షన్లు అప్పటి ఆఫర్లను బట్టి మారవచ్చు.
రూ.3,336 ప్లాన్:
బడ్జెట్‌లో లాంగ్-టర్మ్ ప్లాన్ కోరుకునే వారికి రూ.3,336 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో 336 రోజుల వాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ డేటా, రోజుకు 100 SMSలు, Jio యాప్‌ల యాక్సెస్ లభిస్తాయి.
రూ.2,025 ప్లాన్:
ఇంటర్నెట్ కంటే కాలింగ్ ఎక్కువగా ఉపయోగించే వారికి రూ.2,025 ప్లాన్ సరైన ఎంపిక. ఇందులో ఏడాదికి సమీపమైన వాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, కొంత డేటా, SMSలు లభిస్తాయి. సెకండరీ సిమ్ వాడేవారికి లేదా ఎక్కువగా Wi-Fiపై ఆధారపడేవారికి ఇది మంచి ఆప్షన్.
ఏ ప్లాన్ ఎవరికి బెస్ట్?
రూ.2,025 – ఎక్కువగా కాలింగ్ మాత్రమే చేసే వారికి.
రూ.3,336 – తక్కువ ధరలో ఎక్కువ రోజుల వాలిడిటీ కోరుకునే వారికి.
రూ.3,599 – భారీ డేటా వినియోగదారులు, 5G, OTT, AI ప్రయోజనాలు కోరుకునే వారికి ఉత్తమ ఎంపిక.
రూ.3,999 – ప్రీమియం డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు, అదనపు ప్రయోజనాలు కావాలనుకునే వారికి.