
రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్‌గా కంపోజ్ చేసి న ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నా యి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ “అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు”అని అన్నా రు. డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ “ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్. దీంతోపాటు చిన్న సైకాలజికల్ సస్పెన్స్ ఉం టుంది”అని తెలిపారు. కార్యక్రమంలో రాగ్ మయూర్, రాశి, మెరీన్, రాజీవ్ చిలకా, భరత్, శ్రీచరణ్ పాకాల పాల్గొన్నారు.