Reading Time: < 1 minute

 ఐపిఎల్ సీజన్ 2026కి సర్వం సిద్ధమైంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్రమెంట్‌కు తెరలేస్తోంది. ఇక ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు జట్లు విజయమే లక్షంగా పెట్టుకున్నాయి. రజత్ పటిదార్ సారథ్యంలోని బెంగళూరు భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో బెంగళూరు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.

ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ, పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, బెథెల్, భువనేశ్వర్ కుమార్, జోర్డాన్, డఫీ, కృనాల్ పాండ్య,షెఫర్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు బెంగళూరులో ఉన్నారు. ఇక ఈ టోర్నీకి కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా మారాడు. మరోవైపు హైదరాబాద్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. దీంతో సన్‌రైజర్స్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

రాత్రి 7.30 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్..జియో హాట్‌స్టార్‌లో..