Reading Time: < 1 minute

భద్రాచలంలో రూ.351 కోట్ల తొలి విడత నిధులతో చేపట్టే రామాలయ అభివృద్ధ్ది పనులకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరణ, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మిథిలా స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంను ఆవిష్కరించడంతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పనుల ద్వారా యాత్రికులకు మెరుగైన వసతులు, భద్రత ఏర్పాట్లు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.