Reading Time: < 1 minute

 కుళ్లిన చికెన్ సరఫరా చేస్తున్న వ్యక్తిని హెచ్‌ఫాస్ట్, సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 352కిలోల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కూకట్‌పల్లి, రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన సూరజ్‌పాల్ ఎస్‌పిఆర్ పేరుతో చికెన్ వ్యాపారం చేస్తున్నాడు. కుళ్లిన చికెన్‌ను కొనుగోలు చేసి స్థానికంగా ఉంటున్న చికెన్‌షాపులు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన హెచ్-ఫాస్ట్ బృందం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్,

జింకలవాడ వద్ద ఉన్న మెసర్స్ ఎస్.పి.ఆర్ చికెన్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఎస్‌పిఆర్ సంస్థకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ముగిసినట్లు అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. చ్-ఫాస్ట్ ఇన్స్‌స్పెక్టర్, సిబ్బంది, సనత్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.