
కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగరు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.