
విజయవాడ: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్‌ను అరెస్టు చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.