Reading Time: 2 minutes

సర్లో జనగామ ఫాస్ట్.. ఉమ్మడి వరంగల్లో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

Caption of Image.
  • 2002 లిస్ట్​తో 2025 ఓటరు లిస్ట్​ మ్యాపింగ్
  • ఉమ్మడి జిల్లాలో ​30,83,925 ఓటర్లు
  • 70.67 శాతం మ్యాపింగ్​ కంప్లీట్​

జనగామ, వెలుగు : సెంట్రల్ ఎలక్షన్​ కమిషన్​ ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్ (సర్) మ్యాపింగ్ ఊపందుకుంది. 2002లో ఓటర్ లిస్ట్​తో 2025 లిస్ట్​ను చేస్తున్నారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ జనగామ జిల్లాలో ఫాస్ట్​గా సాగుతోంది. స్టేట్​లో రెండో స్థానంలో నిలవగా ఉమ్మడి వరంగల్​లో ఫస్ట్ ప్లేస్​లో నిలిచింది. 

2002లో ‘సర్’..

స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) 2002లో జరిగింది. ఈ 24 ఏండ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. పల్లె ప్రాంతాలు రూపాంతరం చెంది పట్టణాలుగా మారిపోయాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం ప్రజలు వలసబాట పట్టారు. ఓటు హక్కు ఒక చోట, నివాసం మరోచోట ఉంటున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న ఉదంతాలున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే పారదర్శకంగా ఓటరు జాబితా కోసమే ‘సర్​’ చేపడుతున్నామని ఎన్నికల కమిషన్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

2002 లిస్ట్.. 2025 లిస్ట్​​తో మ్యాపింగ్​

‘సర్’​ నిర్వహణ కోసం 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను మ్యాపింగ్ చేస్తున్నారు. 2025 ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి వరంగల్​లోని ఆరు జిల్లాల్లో 30,83,925 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40 ఏండ్లలోపు ఓటర్లు 17,37,465 మంది ఉన్నారు. 40 ఏండ్ల పైబడిన ఓటర్లు 13,46,460 మంది ఉన్నారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న ఈ ప్రకియలో 2002 లిస్ట్​లోని ఓటర్ల పేర్లు, ఓటర్ ఐడీ నెంబర్ ఉంటే దాని ప్రకారం.. పోలింగ్ స్టేషన్ నెంబర్ ప్రకారం పోల్చి చూస్తున్నారు. అప్పటి పేర్లు ప్రస్తుత జాబితాలో ఉన్నాయా..? లేవా..? అని పరిశీలిస్తున్నారు. బీఎల్వో యాప్​లో అప్​డేట్ 
చేస్తున్నారు. 

70.67 శాతం ఓటర్లు మ్యాపింగ్..

2002–2025 ఓటరు జాబితా మ్యాపింగ్ స్పీడ్​గా సాగుతోంది. ఈ రెండు లిస్ట్​ల పరిశీలనతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 70.67 శాతం ఓటర్లను మ్యాపింగ్​ చేశారు. ఈ మ్యాపింగ్​లో ఉమ్మడి జిల్లాలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, రెండు, మూడు స్థానాల్లో మహబూబాబాద్, ములుగు ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాలు నిలిచాయి. 

మ్యాపింగ్​ పూర్తైన తర్వాత..

ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత లిస్ట్​లో ఓటర్లుగా నమోదైన వారి గురించి పరిశీలన ప్రారంభమై ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. అయితే 2002లో ఓటర్లుగా ఉన్నవారి పేర్లు కూడా ‘సర్​’ లిస్ట్​లో లేవు. కొందరి పేర్లు రెండుసార్లకు మించి ఉన్నాయి. మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల ద్వారా తమ స్థానికతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ తల్లితండ్రులకు సంబంధించిన గుర్తింపును సైతం చూపించాల్సి ఉంటుంది. 

విధుల్లో 3,318 బీఎల్​వోలు..
సర్​ ప్రకియ కోసం బూత్​ లెవల్​ ఆఫీసర్లు (బీఎల్వో)లు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. 930 మంది ఓటర్లకు ఒక్కో బీఎల్​వోను నియమించారు. ఈ విధంగా జనగామ జిల్లాలో 865 మంది విధుల్లో ఉన్నారు. మహబూబాబాద్​లో 555 మంది, వరంగల్​లో 795, హనుమకొండలో 483, భూపాలపల్లిలో 317, ములుగులో 303 మంది బీఎల్వోలు విధుల్లో ఉన్నారు. 

  • ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 2025 ప్రకారం ఓటర్లు, మ్యాపింగ్ ప్రక్రియ 

జిల్లా    40 ఏండ్లలోపు ఓటర్లు    40 ఏండ్లపై..    ఓటర్లు    మ్యాపింగ్    శాతం

జనగామ    4,36,703    3,37,954    7,74,657    6,11,595    78.85
మహబూబాబాద్    2,60,767    2,31,083    4,91,850    3,77,083    76.67
ములుగు    1,29,411    1,09,180    2,38,591    1,76,798    74.10
భూపాలపల్లి    1,60,473    1,20,452    2,80,925    1,98,038    70.49
హనుమకొండ    3,05,318    2,08,390    5,13,708    3,52,198    68.56
వరంగల్    4,44,793    3,39,401    7,84,194    4,63,871    59.15
మొత్తం    17,37,465    13,46,460    30,83,925    21,79,583    70.67

©️ VIL Media Pvt Ltd.