Reading Time: < 1 minute

సిద్ధివినాయక ఆలయంలో చోరీ: సీసీటీవీకి చిక్కిన ఉద్యోగి అరెస్ట్..

Caption of Image.

ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయంలో విరాళాల పెట్టె నుండి డబ్బులు దొంగిలించినందుకు 57 ఏళ్ల రాజేంద్ర పెండూర్కర్ అనే వ్యక్తిని దాదర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

 ఆలయ పూజారి గదిలో ఉన్న రెండు విరాళాల పెట్టెల నుండి ఇతను డబ్బులు తీస్తున్నట్లు  అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు CCTV కెమెరాలను తనిఖీ చేయగా, అతను వేళ్లతో పెట్టెలో నుంచి నోట్లను బయటకు తీస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

ALSO READ : బెంగళూరులో మాజీ డాన్ కొడుకు హంగామా

  ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ. 10 వేల వరకు దొంగిలించినట్లు తెలుస్తోంది. ఆలయ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దొంగతనాలు ఎంత కాలంగా జరుగుతున్నాయి ? ఇందులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.