Reading Time: < 1 minute
Ranveer Singh Dhurandhar Akshaye Khanna Brahmanandam Meeting

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ‘ధురంధర్’ గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గతంలో రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్‌గా రూపొందించారు. ఇక ‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్ పాత్రతో పాటుగా, ‘రెహమాన్ డికాయిట్’ అంటూ అక్షయ్ ఖన్నా నటించిన పాత్రకు కూడా సూపర్ క్రేజ్ లభించింది.

Also Read:Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో

నిజానికి హీరోతో సమానంగా ఆయన పాత్రకు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే, తాజాగా అలాంటి అక్షయ్ ఖన్నాతో టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం భేటీ అయ్యారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని బ్రహ్మానందం తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నిజానికి అక్షయ్ ఖన్నా ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ ‘రెహమాన్’ పాత్ర ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఈ పాత్ర దెబ్బతో ఆయనకు ఎన్నో బడా బ్యానర్ల సినిమాలలో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే ఆయన మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా సినిమాలు ఒప్పుకుంటున్నారు. మరోపక్క బ్రహ్మానందం విషయానికి వస్తే, ఆయన కూడా ఒక రకంగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. మనసుకు నచ్చిన సినిమాలు మాత్రం చేస్తూ వస్తున్నారు.