Reading Time: 2 minutes
Ipl Teams Cross Rs 1000 Crore Sponsorship Revenue Mark What It Means

IPL Sponsorship Revenue: Indian Premier League (ఐపీఎల్) మరోసారి తన వాణిజ్య శక్తిని నిరూపించింది. ఐపీఎల్ జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం రూ.1,000 కోట్ల మైలురాయిని దాటినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఇది లీగ్ ప్రజాదరణ ఎంతగానో పెరిగిందని, అలాగే కార్పొరేట్ కంపెనీలు క్రికెట్‌ను శక్తివంతమైన మార్కెటింగ్ వేదికగా భావిస్తున్నాయని స్పష్టంగా తెలియజేస్తోంది. డబ్ల్యూపీపీ మీడియా రూపొందించిన 2025 ‘స్పోర్టింగ్ నేషన్’ నివేదిక ప్రకారం, ఈ భారీ వృద్ధి ఫ్రాంచైజీలకు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని అందిస్తోంది. టిక్కెట్ అమ్మకాలు, ప్రసార హక్కులు కాకుండా స్పాన్సర్‌షిప్ ఆదాయం కీలక ఆదాయ వనరుగా మారింది.

ఈ వృద్ధి వెనుక కారణాలు:
ఐపీఎల్‌లో స్పాన్సర్‌షిప్ వృద్ధికి ప్రధాన కారణం బ్రాండ్ వైవిధ్యీకరణ
టెక్నాలజీ కంపెనీలు
ఫిన్‌టెక్ సంస్థలు
ఏవియేషన్ రంగం
పునరుత్పాదక ఇంధన సంస్థలు

ఈ రంగాల సంస్థలు ఐపీఎల్‌ను దేశవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను చేరుకునే ప్రధాన వేదికగా చూస్తున్నాయి. అంతేకాక, అంతర్జాతీయ బ్రాండ్‌లు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.

అగ్రస్థానంలో ఉన్న జట్లు
స్పాన్సర్‌షిప్ ఆదాయాల్లో కొన్ని జట్లు ముందంజలో ఉన్నాయి.. అందులో ముంబై ఇండియ్స్‌ (Mumbai Indians), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore).. చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) ఉన్నాయి.. ఈ మూడు జట్లు ఒక్కొక్కటి సుమారు రూ.150 కోట్ల వరకు స్పాన్సర్‌షిప్ ఆదాయం ఆర్జిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటి తర్వాత Kolkata Knight Riders మరియు Gujarat Titans ఉన్నాయి.

గ్లోబల్ లీగ్‌లతో పోల్చితే
ప్రపంచ స్థాయిలో కూడా ఐపీఎల్ ప్రత్యేక స్థానం సంపాదించింది.. English Premier League ఆదాయం పరంగా ముందంజలో ఉన్నప్పటికీ.. మ్యాచ్‌కు వచ్చే మీడియా హక్కుల విలువలో ఐపీఎల్ ఇప్పటికే దాన్ని అధిగమించింది.. National Football League తర్వాతి స్థానంలో నిలిచింది.. Formula One మరియు ఇతర లీగ్‌లతో పోలిస్తే, ఐపీఎల్ కేవలం 2 నెలల కాలంలోనే భారీ ఆర్థిక ప్రభావాన్ని సృష్టించడం విశేషం.

దీని అర్థం ఏమిటి?
ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, భారీ వ్యాపార వేదికగా మారింది.. బ్రాండ్‌లకు ఇది అత్యంత ప్రభావవంతమైన మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.. ఫ్రాంచైజీలకు స్థిరమైన ఆదాయ వనరుగా అవతరించింది.. భారత క్రీడా రంగంలో వ్యాపార అవకాశాలు విస్తరిస్తోంది.. ఇక, ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ ఆదాయం రూ.1000 కోట్లను దాటడం, లీగ్ యొక్క వాణిజ్య శక్తిని మరింత బలపరుస్తోంది. ఇది భవిష్యత్తులో ఐపీఎల్‌ను ప్రపంచ క్రీడా రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సూచనగా భావిస్తున్నారు.