Reading Time: < 1 minute

తైపే( తైవాన్) : ఆన్‌లైన్ మోసాలతోపాటు హత్యలు, టెలికాం మోసాలు, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్న మయన్మార్‌కు చెందిన గ్యాంగ్ లోని మరో నలుగురికి చైనాలో మరణశిక్ష అమలైంది. ఆరుగురు చైనీయుల మరణానికి వీరు కారణమైనట్టు తేలడంతో గత ఏడాది నవంబరులో కోర్టు మరణ శిక్ష విధించింది.మయన్మార్‌లో స్కామ్ సెంటర్లు నడుపుతున్న 11 మంది సభ్యుల నేర ముఠాకు మరణశిక్ష అమలు చేసినట్టు గతవారం ప్రకటించింది.

స్కామ్ సెంటర్లు, కేసినోలు నడుపుతున్న బై కుటుంబానికి చెందిన వారితో సహా ఐదుగురికి షెంజెన్ కోర్టు గత నవంబరులో మరణశిక్ష విధించగా, వారిలో ఒకరు బై సోచింగ్‌గ్రూపు లీడర్ శిక్ష పడిన తరువాత అస్వస్థుడై మృతి చెందాడు. ఈ మాఫియా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకోడానికి ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు తీసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యం లోనే ఆ ముఠా లోని నలుగురికి మరణశిక్ష అమలైనట్టు వెలుగులోకి వచ్చింది.