Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కేసితండా వద్ద కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు.ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి చెరువులో బాలురు పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం చెరువులో నుంచి గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రిషి(6),బద్రినాథ్ (8)గా పోలీసులు గుర్తించారు.