Reading Time: < 1 minute

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయన సినిమాలో చేస్తోన్న క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. టాక్సిక్ సినిమా తొలి ఫ్రేమ్ నుంచే ఓ చీకటి రాజ్యాన్ని, రాజీ పడని స్వభావాన్ని తెలియజేస్తోంది. యష్ ప్రయాణాన్ని గమనిస్తే తనొక రిస్క్ టేకర్ అనే విషయం స్పష్టమవుతుంది. నటుడిగానే కాకుండా ఈ సినిమాతో యశ్ సహ రచయిత, నిర్మాతగానూ మారారు.

యశ్, గీతూ మోహన్‌దాస్ రాసిన ఈ కథకు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాను అంతర్జాతీయంగా ప్రేక్షకులకును మెప్పించేలా ఒకేసారి కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో షూట్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా ఇతర భాషల్లో డబ్బింగ్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్నారు. సినిమా మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.