Reading Time: < 1 minute

లక్నో: మైనర్ బాలికను కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం కారులో బాలికపై ఎస్‌ఐ, యూట్యూబర్, జర్నలిస్టు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్నూర్‌లో జరిగింది. బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి సచేండి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చింది. కారులో ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. వెంటనే ఆమె సోదరుడు గమనించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. కారులోనే బాలికపై ఎస్‌ఐ, జర్నలిస్టు, యూట్యూబర్ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రెండు గంటల తరువాత ఇంటికి సమీపంలో బాలికను వదిలేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో ఉన్నతాధికారి త్రిపాఠి వెంటనే స్పందించారు. నిందితులపై గ్యాంగ్ రేప్, పోక్సో యాక్టుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. జర్నలిస్ట్ శివభరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఎస్‌ఐ కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.