
హైదరాబాద్: చైనా మాంజాపై కేంద్రం నిషేధం విధించిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. కొన్ని ఈ కామర్స్ సైట్లకు నోటీసులు ఇచ్చామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా నిల్వ చేసి చైనా మాంజాను విక్రయిస్తున్నారని, చైనా మాంజాకు గాజు పెంకులు, మెటలిక్ కోటింగ్ చేస్తారని తెలియజేశారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలో భారీగా మాంజా స్వాధీనం చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో భారీగా చైనా మాంజా పట్టివేశారు. రూ.1.2 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేశారు. చైనా మాంజా స్వాధీనం ఘటనలో 103 కేసులు నమోదు అయ్యాయి. చైనా మాంజా స్వాధీనం కేసులో 143 మంది అరెస్టు అయ్యారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజా దుకాణదారులు తెప్పిస్తున్నారని సజ్జనార్ స్పష్టం చేశారు.