Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్:మార్కెటింగ్ శాఖ లో పత్తి కొనుగోళ్లకు సంబంధించి జరిగిన అవినీతి పై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలిసింది. టెంపరరీ రిజిస్ట్రేషన్(టిఆర్) పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరగడంతో ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సిఐడి విచారణలో మరిన్ని అక్రమాలను వెల్లడ య్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇ ప్పటికే ఈ కేసులో 118 మంది అధికారులకు సం బంధం ఉందని విజిలెన్స్ నిగ్గుతేల్చగా సిఐడి విచారణలో దళారుల పాత్ర, మరికొంతమంది ఉన్నతాధికారుల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. సిఐడి విచారణలో భాగంగా పత్తిని కొనుగోళ్లు చేసే సిసిఐ సంస్థ (5 ఏళ్లుగా రైతుల నుంచి పత్తి కొనుగోళ్లకు) సంబంధించి వివరాలు ఇవ్వాలని సిఐడి లేఖ రాసినట్టుగా తెలిసిం ది. కొన్నేళ్లుగా సిసిఐ కేంద్రంగా పలువురు దళారులు ఈ అవినీతి దందాకు తెరలేపడంతో సిఎం రేవంత్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నే సిఐడితో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ శాఖ15 జిల్లా ల్లో విచారణ చేసి టెంపరరీ రిజిస్ట్రేషన్

జారీలో భారీగా అక్రమాలు జరిగాయని 2025, డిసెంబర్‌లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కేసుతో సుమారుగా 118 మంది అధికారులకు సంబంధాలు ఉన్నాయని విజిలెన్స్ నిగ్గుతేల్చింది. అందులో 45 మంది ఏఈఓలు, 25 మంది డేటాఎంట్రీ ఆపరేటర్‌లు, డిఎంఓలు 03, జిల్లా మార్కెటింగ్ అధికారు లు 03, మార్కెటింగ్ సెక్రటరీలు 36 మంది ఉన్నట్టుగా విజిలెన్స్ ఈ నివేదికలో పే ర్కొంది.ఈ విజిలెన్స్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయి తే, గత డిసెంబర్‌లో విజిలెన్స్ నివేదిక ఇచ్చినా, మంత్రి ఆదేశించినా ఇప్పటివరకు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడం విశేషం. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖలో పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తు తం ఈ 118 మం దిపై చర్యలు తీసుకుంటే రాను న్న రోజుల్లో వీరికి పదోన్నతులకు కష్టమవుతుంద ని భావించిన కొందరుఉన్నతాధికారులు వారిపై చర్య తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా ఈ 118 మంది అధికారుల నుంచి ముడుపులు తీసుకొని ముందుగా ఆరోపణలు వెల్లువెత్తిన వారికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడుసార్లు మంత్రి తుమ్మల ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులను పిలిపించి మాట్లడగా త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిని తప్పుదారి పట్టిస్తున్నట్టుగా తెలిసింది.

గత సంవత్సరం పత్తి కొనుగోళ్ల విషయంలో

పత్తి విక్రయాలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులు, దళారులు కుమ్మక్కు అవుతున్నారని దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, గత సంవత్సరం పత్తి కొనుగోళ్ల విషయంలో రైతుల పేరిట దళారులకు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టిఆర్) పత్రాలను జారీ చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ శాఖ విచారణ చేసి గత కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని తేల్చడంతో పాటు ఎలా అవినీతి జరిగిందన్న విషయాల గురించి నివేదిక అందచేసింది.

విజిలెన్స్ నివేదికలోని కొన్ని అంశాలు….

ఈ నివేదికలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. పడిగ బతుకమ్మకు 9.10 ఎకరాల భూమి ఉంది. ఈ 9.10 ఎకరాలకు గాను టోకెన్ నెంబర్ 12514ను కౌలుదారు అయిన కోరెం అరుణకు జారీ చేశారు. ఇదే భూమిపై మరో టోకెన్ నెంబర్ 12508ను ఏనుగండ్ల కోటేశ్‌కు, 12540 టోకెన్ బుర్రి కల్పనకు జారీ చేశారు. ఇలా 9.10 ఎకరాలపై ముగ్గురికి టోకెన్‌లను అధికారులు జారీ చేసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే కోవలోనే పడిగ లక్ష్మి పట్టాదారుకు 9.10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో సాగు చేసిన పత్తికొనుగోళ్లకు సంబంధించి టోకెన్ నెంబర్ 12504ను కౌలుదారు తురం రామారావుకు జారీ చేశారు. ఈయనతో పాటు మరో కౌలుదారు కోర్స అంజీకి టోకెన్ నెంబర్ 12757ను, ఇంకో కౌలుదారు కోరం నరేందర్‌కు 12515ను జారీ చేసి అక్రమాలకు తెరలేపారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. ఇలాంటి అక్రమాలను తన నివేదికలో విజిలెన్స్ శాఖ పేర్కొంది.