
ప్రేమ వ్యహారంలో యువతి, యువకుడు మృతి చెందిన సంఘటన హైద్రాబాద్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరలోకి వెళితే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్ (23) అదే గ్రామానికి చెందిన బంధువు పూజ (మైనర్ బాలిక) ఇరువురు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఇంతలో పూజ తల్లిదండ్రులు ప్రేమ వ్యవహరానికి నిరాకరించారు. నిరాకరించడమే కాకుండా పూజకి పెళ్లి సంబంధాలు చూశారు. దింతో పూజ కలత చెంది 6వ తేదీన మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజా మృతిని తట్టుకోలేక మహేష్ బుధవారం ఉదయం 11గంటల ప్రాంతంలో అబ్దుల్లా పూర్ మెట్టు మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. స్థానికుల సమాచారం మేరకు హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.