
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌ను జనవరి 9 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సమంతతో ఇది వరకు ‘ఓ బేబి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ నందినీ రెడ్డి ..మరోసారి ఈ స్టార్ హీరోయిన్‌ను ‘మా ఇంటి బంగారం’లో డైరెక్ట్ చేస్తోంది. ఈ హిట్ కాంబోపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈసారి మాత్రం డిఫరెంట్ ఎమోషన్స్, స్టోరీతో, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రను పోషించడంతో పాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.