Reading Time: < 1 minute

అమరావతి: వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంలేదని ఓ మహిళను ప్రియుడు గొంతు కోసి హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని కొర్లగుంట మండలం మారుతీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్త, కుమారుడితో కలిసి తిరుపతిలోని ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటుంది. రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. సోమశేఖర్ గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. తిరుపతి బస్టాండ్ సమీపంలో హోటల్‌లో లక్ష్మి పని చేస్తుంది. సోమశేఖర్‌తో లక్ష్మికి పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త తెలిస్తే గొడవలు జరుగుతాయిని. వివాహేతర సంబంధానికి స్వస్తి పలికి ప్రియుడి దూరంగా ఉంటుంది. సోమశేఖర్ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెతో మాట్లాడుదామని రూమ్‌కు పిలిచి అక్రమ సంబంధం కొనసాగించాలని గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో కత్తి తీసుకొని ఆమె గొంతు కోసి అనంతరం అతడు ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.