Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: బారతీయులు ఇరాన్‌కు అత్యవసరమైతే తప్పితే వెళ్లరాదని కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన వెలువరించారు. ద్రవ్బోల్బణం, కరెన్సీ విలువ పతనం వంటి పరిస్థితులు. జనం వీధులోకి వచ్చి ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం వంటి పరిణామాలతో ఇరాన్‌లో ఉద్రిక్తత పెరుగుతోంది. నిరసనకారులపై అణచివేతలకు దిగితే తాము జోక్యం చేసుకుని తీరుతామని అమెరికా అద్యక్షులు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అమెరికా సైనిక చర్య ఉంటుందనే అనుమానాలు తలెత్తాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి నెలకొంది.

ప్రస్తుత దశలో అవసరం లేదనుకుంటే ఇరాన్‌కు వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ అంశాన్ని అంతా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. ముప్పు కొని తెచ్చుకోరాదని హెచ్చరించారు. తమ తదుపరి ప్రకటన వెలువడే వరకూ భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లోకి వెళ్లకూడదని దీనిని గుర్తించాలని విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.