
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నదీ జిలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్, రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై సిఎం తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ సూచన మేరకు ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి నోటీసులు అందజేశారు.