
టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి మరో ఊహించని షాక్ తగిలింది. షమీ, అతడి సోదరుడు కైఫ్‌లకు ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. బెంగాల్‌లో ఎన్నికల వేళ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియలో భాగంగా విచారణకు హాజరు కావాలని ఆదేవించింది. షమీ ఓటరు మ్యాపింగ్‌కు సంబంధించిన పలు విషయాలపై స్పష్టత ఇవ్వడానికి అతడు నేడు ఇసి ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం షమీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న నేపథ్యంలో విచారణకు హాజరుకాలేదు. దీంతో జనవరి 9-11 మధ్యలో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(AERO) ముందు హాజరుకావాలని ఇసి తాజాగా సమన్లు జారీ చేసింది.
షమీ యూపీలోని అమ్రోహాలో జన్మించినప్పటికీ.. చాలా ఏళ్లుగా కోల్‌కతాలో స్థిరపడ్డాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్(కెఎంసి) వార్డు నంబర్ 93లో షమీ ఓటరుగా ఉణ్నాడు. ఇది రాష్‌బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవల చేపట్టిన సర్ ప్రక్రియలో షమీ ఓటర్ మ్యాపింగ్‌కు సంబంధించి సమగ్ర సమాచారం లేకపోవడంతో ఈ విషయమై విచారణ జరిపేందుకు హాజరు కావాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సర్ ప్రక్రియలో భాగంగా తృణమూల్ ఎంపి, నటుడు దేవ్‌కు కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.