
ఎర్రకోట పేలుళ్ల కేసులో నిందితుడు యాసిర్ అహ్మద్‌దార్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం 11 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. నిందితుడు యాసిర్ అహ్మద్ దార్ కోర్టుకు హాజరైన తరువాత ప్రిన్సిపల్ జడ్జి, సెషన్స్ జడ్జి అంజు బజాజ్ చంద్ర నిందితుడు దార్‌ను జనవరి 16 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.గత డిసెంబర్ 26న కోర్టు దార్ ఎన్‌ఐఎ కస్టడీని పది రోజుల పాటు పొడిగించింది. ఈ కేసులో తొమ్మిదో నిందితుడైన యాసిర్ అహ్మద్‌ను ఎన్‌ఐఎ డిసెంబర్ 18న అరెస్టు చేసింది. జమ్ముకశ్మీర్ నివాసి అయిన దార్ ప్రధాన నిందితుడైన ఆత్మాహుతి బాంబర్ ఉమర్‌ఉన్ నబీకి అత్యంత సన్నిహితుడు. ఈ పేలుళ్ల కుట్రలో దార్ కీలక పాత్ర వహించాడని ఆరోపణలు ఉన్నాయి. ఉమర్ యున్ నబీ, ముఫ్తీ ఇర్ఫాన్‌తోసహా ఇతర నిందితులతో సన్నిహిత సంబంధాలు దార్‌కు ఉన్నాయని ఎన్‌ఐఎ ఆరోపించింది