Reading Time: < 1 minute

 గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సందర్శిస్తారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.ఈ ఆలయంపై తొలి దాడి జరిగి వేయి సంవత్సరాలు పూర్తయిన దశలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరిట ప్రత్యేకంగా ఏడాది పాటు ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. ఇక ఈ నెల 8 నుంచి 11 వరకూ సోమనాథ్‌లో అనేక ఆధ్యాత్మిక , సామాజిక సదస్సులు , సమావేశాలు జరుగుతాయి.సోమనాథ్ విశిష్టతపై ప్రధాని మోడీ ప్రత్యేక వ్యాసం వెలువరించారు. మోడీ ఛైర్మన్‌గా శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఏర్పాటు అయి ఉంది. సోమనాథ్ ప్రత్యేక కార్యక్రమాలలో ప్రఖ్యాత పండితులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొంటారు. సోమనాథ దేవాటయం పట్ల ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానం ఉంది. అనేకానేక పరాయి పాలకుల దాడులు, ఆక్రమణలను తట్టుకుని నిలిచిన ఈ ఆలయం పునర్నిర్మాణం మహత్తర ఘట్టం అయింది. భారత నాగకరికత చెక్కుచెదరని స్ఫూర్తికి ప్రతీక అయిందని మోడీ స్పందించా