Reading Time: < 1 minute

హైదరాబాద్: పోలవరం- నల్లమల సాగర్ అంతరాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం- నల్లమలసాగర్ ను ఫోరమ్ లలో అన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమలసాగర్ ను వ్యతిరేకిస్తూ జిఆర్ఎంబికి లేఖ రాశామని, తమ అభిప్రాయాన్ని గోదావరి బోర్డు కూడా సమర్థించిందని తెలియజేశారు. పోలవరం-నల్లమలసాగర్ ను మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకించాయని, రిట్ పిటిషన్ కాదని.. సూట్ పిటిషన్ తో రావాలని సుప్రీం కోర్టు సూచిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చేవారం కోరతామని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతలు ఆగిందని అన్నారు.  గతంలో ఆగి ఉంటే బిఆర్ఎస్ ఎందుకు చెప్పలేదు? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.