Reading Time: < 1 minute

ఢాకా: బంగ్లాదేశ్‌లో నెలకొన్నన రాజకీయ అనిశ్చితి వల్ల అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనరిటీలు అయిన హిందువులను దహనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బంగ్లాదేశీ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఆడనివద్దు అనే డిమాండ్ తెరపైకి రావడంతో బిసిసిఐ కూడా అందుకు బిసిసిఐ ఒప్పుకుంది. ఈ సారి జరిగిన వేలంలో రెహమాన్‌ను రూ.9.2 కోట్లకు కెకెఆర్ దక్కించుకుంది. కానీ, బిసిసిఐ ఆదేశాలతో అతడిని కెకెఆర్ రిలీజ్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే టి-20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసిసిని కోరింది. తాజాగా తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారంపై నిషేధం విధించింది.