
ఐసిసి టి-20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే రీసెంట్‌గా ప్రకటించిన న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే జట్టులో మాత్రం సిరాజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాకపోవడం దురదృష్టకమని సౌతాఫ్రికా దిగ్గజం ఎబి డివిలియర్స్ అన్నాఢు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఎబిడి మాట్లాడాుడు భారత సెలక్టర్లు ఫామ్, నాణ్యత కంటే జట్టు కూర్పు పైనే ఎక్కువ దృష్టి పెట్టారని పేర్కొన్నాడు.
‘‘మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ, దురదృష్టకరం ఏంటంటే అతను టి-20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. బుమ్రా, అర్ష్‌దీప్ ఎంపికయ్యారు. హర్షిత్ బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. వారు కేవలం సీజమ బౌలర్లకే ప్రాధాన్య ఇవ్వలేదు. స్పిన్నర్లపై కూడా దృష్టి పెట్టారు. ఒకవేళ వారు సీమర్లతో పాటు వికెట్ సాధిస్తే.. అది బో్నస్ అవుతుంది’’ అని డివిలియర్స్ అన్నాడు.