
అమరావతి: ఎంపిపి ఎన్నికల సందర్భంగా పట్టపగలు నడిరోడ్డుపై వైసిపి ఎంపిటిసిలను కిడ్నాప్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో వైసిపి ఎంపిటిసిలను కిడ్నాప్ చేయడంతో వింజమూరు, రాయదుర్గం, బొమ్మనహాల్ లలో టెన్షన్, టెన్షన్ నెలకొంది. ఓటేసేందుకు వస్తున్న ఐదుగురు వైసిపి ఎంపిటిసిలను టిడిపి నేతలు అడ్డగించి కిడ్నాప్ చేశారు. వైసిపి ఎంపిటిసిలపై టిడిపి ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కిడ్నాప్ చేస్తుండగా మహిళా ఎంపిటిసి రత్నమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మల్లికార్జున్ అనే వైసిపి ఎంపిటిసిని ఎత్తుకెళ్లారు. మరో ఎంపిటీసి మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎంపిడిఒ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం సృష్టించారు. తమను నిర్భంధించి ఎంపిపి ఎన్నిక పూర్తి చేయడం మంచిది కాదని వైసిపి ఎంపిటిసిలు ఆరోపణలు చేశారు. టిడిపి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఎంపిపి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసిపి నేతలు మండిపడుతున్నారు.