Reading Time: < 1 minute

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న హైలీ ఎంటర్‌టైనర్ ’మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాశ్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఆసక్తికరంగా చూపించారు. వ్యవసాయం గురించి ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్‌టైైనింగ్‌గా ఉంటుంది‘అని అన్నారు. డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల మొహంలో చిరునవ్వు ఎక్కడికి పోదు. ఈ సినిమా ఆనందింపజేస్తుంది, ఆలోచింపచేస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ ప్రసాద్, బి వి ఎస్ రవి, పాయల్, అరవింద్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.