
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా తనకల్లులో దారుణహత్య జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా మర్డర్ చోటుచేసకుంది. పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిని అడ్డంగా నరికి చంపారు. హత్యకు గరైన వ్యక్తి ఈశ్వరప్పగా గుర్తించారు. హంతకుడు చిన్నప్పను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ పేరుతో ఈశ్వరప్ప ఓ వివాహితను తీసుకెళ్లాడు. తనకల్లు పోలీసులు మహిళ భర్త హరిని వెంటబెట్టుకొని నెల్లూరు జిల్లా గూడూరు వెళ్లారు. ఈశ్వరప్ప, మహిళను గూడూరు నుంచి తనకల్లు పిఎస్‌కు తరలించారు. పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను భర్త హరి, ఆయన బంధువులు నరికి చంపారు. పోలీసులు భయంతో పరుగులు తీశారు. ఈశ్వరప్ప తరలింపు వ్యవహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని ఎస్సై గోపిపై విమర్శలు వస్తున్నాయి. కదిరి నియోజకవర్గం తనకల్లు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.