Reading Time: < 1 minute

న్యూయార్క్: అమెరికాలోని మేరీలాండ్ ప్రాంతం కొలంబియాలో భారతీయ యువతి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె ప్రియుడు ఆమెను చంపి అనంతరం అమెరికాను విడిచి భారత్‌కు పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్జున్ శర్మకు(26), నికిత గొడిశాల అనే యువతి(27) పరిచయం ఉండడంతో ఇద్దరు గతంలో ప్రేమికులుగా ఉన్నారు. నికిత కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్ అర్జున్ ఫిర్యాదు చేశాడు. ఆమెను చివరిసారిగా డిసెంబర్ 31వ తేదీన చూశానని చెప్పాడు. జనవరి 2వ తేదీన అతడు భారత్ పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా పోలీసులు అతడి కోసం సెర్చ్ వారెంట్ కూడా జారీ చేశారు. డిసెంబర్ 31 అర్థరాత్రి సమయంలో నికితను అర్జున్ తన ఆపార్ట్‌మెంట్‌లో చంపాడు. అనంతరం ఆమె కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అతడు అమెరికాను విడిచి భారత్ కు పారిపోయాడు. దీంతో పోలీసులు అనుమానం వచ్చి అతడి ఆపార్ట్ మెంట్ ను సెర్చ్ చేయడం నికిత మృతదేహం కనిపించింది. మృతదేహంపై కత్తితో పొడిచి చంపినట్లు గాయాలు ఉన్నట్టు తెలిసింది. నికిత కనిపించడంలేదని ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ చేశారు. ఆమె హత్యకు గురైందని తెలియడంతో స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని సికింద్రాబాద్ అన్నట్టుగా సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిసింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.