
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో ఆడలేమని, తాము ఆడే మ్యాచ్‌ల వేదికలను వేరే చోటికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసిసిని కోరింది. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు ఐసిసికి లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితిని క్షుణంగా సమీక్షించాం. ఇలాంటి స్థితిలో భారత్‌లో ఆడితే ఆటగాళ్లకు భద్రత పరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని బంగ్లా బోర్డు ఆ లేఖలో పేర్కొంది. తమ ప్రభుత్వం కూడా భారత్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. ఇలాంటి స్థితిలో వేదికలను భారత్ నుంచి వేరే చోటికి మార్చాలని బంగ్లా బోర్డు లేఖలో విజ్ఞప్తి చేసింది.