Reading Time: < 1 minute

కారకాస్: అమెరికా సైనిక దళాల ఆపరేషన్ కారణంగా శనివారం నికోలస్ మదురోను యుఎస్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వెనెజువెలా సుప్రీంకోర్టు రాజ్యాంగ సభ, వైస్ ప్రె సిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ ను దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. దేశ పాలనా వ్యవహారాలు కొనసాగించేందుకు, దేశ సమగ్ర రక్షణకు హామీ ఇచ్చేందుకు బొలీవేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనెజువెలా అధ్యక్ష పదవిని డెల్సీ రోడ్రిగ్జ్ స్వీకరిస్తారని కోర్టు ఆదేశాలను ప్రకటించారు. దేశం లో పాలనా పరమైన నిర్ణయాలు కొనసాగింపునకు రిపబ్లిక్ ప్రె సిడెంట్ హాజరు కాని పక్షంలో సార్వ భౌమాధికారాలను కాపాడేం దుకు వర్తించే చట్టపరమైన అంశాలను చర్చించి, కోర్టు త గిన సూచనలు సలహాలు ఇస్తుందని ఆ తీర్పులో వెల్లడించారు.