Reading Time: < 1 minute

వెనెజువెలా పరిణామాలపై భారత్ స్పందన

కారకస్‌లోని ఇండియన్లకు హెచ్చరిక

దాడి ప్రమాదకర పరిణామం: ఐరాస

నేడు భద్రతా మండలి భేటీ

ట్రంప్ చరపై భగ్గుమంటున్న పలు దేశాలు

న్యూఢిల్లీ : వెనెజువెలాలో కీలక పరిణామాలపై భారతదేశం ఆదివారం స్పందించింది. పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వెనెజువెలా ప్రజల బాగోగుల గురించి తాము ఆందోళన చెందుతున్నామని, అక్కడి సామాన్య పౌరులకు ఎటువంటి ముప్పు వాటిల్లరాదని తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల రక్షణకు చర్యలు తీసుకోవల్సి ఉందని స్పందించారు. శాంతియుత పద్థతుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవల్సి ఉంటుందని వెల్లడించారు. ఎటువంటి క్లిష్టతలకు అయినా సంబంధిత పక్షాలు సంప్రదింపులకు దిగితే బాగుంటుందని ప్రకటన వెలువడింది. కరాకస్‌లోని భారతీయ దౌత్య కార్యాలయ సిబ్బందితో వెంటనే మాట్లాడినట్లు, అవసరం బట్టి వారికి అన్ని విధాలుగా సాయం అందుతుందని వెల్లడించారు.