Reading Time: 2 minutes

 గజ్వేల్ సమస్యలపై అసెంబ్లీలో చర్చలు జరపాలి

సిద్దిపేట డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన

ఫాంహౌస్ గేటు ముందు తివాచీ పరిచి, పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్

సార్‌కు ఆరోగ్యం బాగోలేదని కెసిఆర్ పిఎ వివరణ

శాంతించిన కాంగ్రెస్ నేతలు

మన తెలంగాణ/మర్కుక్/గజ్వేల్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీకి రావాలని..లేదంటే పదవికి రాజీనా మా చేయాలని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, పార్టీ నేతలు ఆదివారం సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మర్కుక్ మండలం, ఎర్రవల్లి గ్రామ సమీపంలోని ఫామ్‌హౌస్‌ను ముట్టడించారు. అనంత రం అక్కడే పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వందలాది కాంగ్రెస్ శేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కెసిఆర్ ఫాంహౌస్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచీ పరిచి, పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కెసిఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అం దుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకుపైగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమం లో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారి మ ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడు తూ.. కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని సమస్యలపై అసెంబ్లీలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ స మావేశాలు జరుగుతున్నాయని, మరో నాలుగు రోజుల్లో సమావేశాలు పూర్తవుతాయని, ఇలాంటి సమయంలో గజ్వేల్ ముంపు గ్రామ ప్రజల తరఫున, గజ్వేల్ సమస్యల తరఫున అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాల్సింది పోయి ఫామ్ హౌస్‌లో కాలయాపన చేయడం సరికాదం టూ కెసిఆర్ తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా స్పం దించి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని, లేదంటే గడీ లు బద్దలు కొట్టే సమయం ముందుందంటూ హెచ్చరించారు. కెసిఆర్ పిఏ వచ్చి కెసిఆర్ ఆరోగ్యం బాగాలేదని వివరణ ఇచ్చి త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారని అనడంతో కాంగ్రెస్ నేతలు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసి చైర్మన్ వంటే రు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మర్కుక్ మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నేత లు, కార్యకర్తలు పాల్గొన్నారు.