
మన తెలంగాణ/హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థిని, రచయిత్రి ఎర్రపరెడ్డి శ్రీజ రచించిన ‘హార్శ్ రియాలిటీ’, ‘ఆల్మోస్ట్ సీన్ నెవెర్ నోన్’ రెండు ఆంగ్ల పుస్తకాలను మన తెలంగాణ సంపాదకులు దేవులపల్లి అమర్ ఆవిష్కరించారు. బంజారా హిల్స్ ఎంఎల్ఎ కాలనీ రిక్రియేషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మహిళల మనోభావాలను చాటి చెపుతూ, వారి ఆత్మ స్థ్యర్యాన్ని పెంచే విధంగా చిన్న వయసులోనే రచనలు సాగిస్తున్నారని శ్రీజను అభినందించారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రిక్రియేషన్ సెంటర్ అధ్య క్షులు డాక్టర్ వై వై రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిదులుగా అన్నమాచార్య విశ్వవిద్యాలయం ఛాన్సెలర్ గంగిరెడ్డి , కార్తికేయ ఇండస్ట్రీ సిఎండి అనంత రెడ్డి , రిక్రియేషన్ సెంటర్ ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి హాజరై శ్రీజను అభినందించారు. ఇలా ఉండగా ఈ పుస్తకాన్ని ఏడవ తరగతి విద్యార్థిని లింగాల శ్రీనిక సమీక్ష చేయడం విశేషం.