Reading Time: < 1 minute

శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట రైల్వే స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ యువకుడు రైలు పైకి ఎక్కి పరిగెడుతూ హల్‌చల్ చేశాడు. ఆ యువకుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడిగా గుర్తించారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్‌ ఫాస్ట్ వీక్లీ ఎక్క్‌ప్రెస్ ఎక్కి అటూ ఇటూ పరుగులు పెట్టాడు. అతడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతడికి మతిస్థిమితం లేదని రైల్వే అధికారులు గుర్తించారు.