Reading Time: < 1 minute

తమిళ హీరో అయినప్పటికీ.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడ చేరువైన నటుడు శివకార్తికేయన్. అతడు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘పరాశక్తి’. తెలుగు బ్యూటీ శ్రీలీల ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. రవి మోహన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ సినిమా శనివారం (జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. అయితే తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రం 1964లో తమిళనాడులోని ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారం రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు, ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది.? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ట్రైలర్‌లో నటీనటుల ప్రదర్శన.. మ్యూజిక్, యాక్షన్ సీన్లు, అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు ట్రైలర్ కూడా వస్తే.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మరింత చేరువయ్యే అవకాశం ఉంది.