Reading Time: < 1 minute

హీరో శర్వానంద్ సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’. సంయుక్త, సాక్షి వైద్య ఇందులో హీరోయిన్లు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ని వదిలింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు మరో యువ స్టార్ హీరో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అతడే శ్రీ విష్ణు. ఇందుకు సంబంధించి ఓ చిన్న వీడియోని విడుదల చేశారు. మరి ఈ సినిమాలో శ్రీ విష్ణు పాత్ర ఎలా ఉంటుందో వెండి తెరపై చూడాల్సిందే.

ఇక ఈ సినిమాని సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అని సుంకర నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కానుంది.