
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. భోగాపురానికి వాలిడేషన్ ప్లెట్ రాకతో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చాయని అన్నారు. కనెక్టివిటీ పెరుగుదల సహా ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఇది బలమైన పునాది అని ఈ ప్రాజెక్టుకు దూరదృష్టితో మార్గనిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది జూన్ నుంచి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం కానుందని లోకేష్ పేర్కొన్నారు.