Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, పోస్టర్స్ ‌అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకూ చూడని చిరంజీవిని ఇందులో చూస్తారు అని చెప్పడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూస్తే.. చిరు యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టేశారు. హీరోయిన్ నయనతార, చిరుల మధ్య జరిగే సన్నివేశాలు కూడా అలరించే విధంగా ఉన్నాయి. మొత్తానికి తనదైన శైలీలో ట్రైలర్‌ని చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. చివర్లో విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో ఇంకా హైప్ పెరిగిపోయింది. చిరంజీవి.. వెంకీని ఫ్యామిలీ మ్యాన్ అంటే.. వెంకీ.. చిరుని మాస్ కే బాస్‌ అంటూ సంబోధించారు. ఇక ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.