
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. ఇది కేవలం పాన్ ఇండియా చిత్రం కాదు.. పాన్ వరల్డ్ చిత్రమని ఎప్పుడో ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ప్రకటన ఈవెంట్ ‘గ్లోబ్‌ట్రాటర్’ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో టైటిల్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్ గురించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అభిమానులకు షాక్ ఇస్తూ.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ టీజర్ చరిత్ర సృష్టించనుంది. పారిస్‌లోని ‘లే గ్రాండ్ రెక్స్’లో ఈ టీజర్‌ను జనవరి 5వ తేదీ రాత్రి 9న విడుదల కానుంది. 2,702 సీట్లు కలిగిన ఈ థియేటర్.. యూరప్‌లోనే అతిపెద్దదిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్ బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది.